తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంకురార్పణలో భాగంగా పుణ్యాహవచనం, రక్షాబంధనంతో పాటు శుక్రవారపుతోటలో పుట్టమన్ను సేకరించి అంకురార్పణ చేపట్టారు. రేపటి నుంచి మూడు రోజులపాటు వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ఊరేగిస్తారు. కరోనా ప్రభావంతో ఏకాంతంగా వసంతోత్సవాలు చేస్తున్నారు. ఈ కారణంగా మే 26న స్వర్ణరథోత్సవానికి బదులుగా తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
ఇదీ చూడండి. 30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి