ETV Bharat / state

కిసాన్ రైలు.. రైతుకు మేలు!

కరోనా.. రైతులను కష్టాల్లోకి నెట్టింది. ఉద్యాన పంటలు సాగు చేసినవారు మరింతగా నష్ట పోయారు. టమోటా పంటను తోటల్లోనే వదిలేశారు. పూలను కోసి రోడ్లపై పారబోయాల్సి వచ్చింది. పండ్లు అమ్ముడు పోవడంలేదు. మామిడి రైతుల పరిస్థితి మరింత దీయనీయంగా ఉంది. కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ కారణంగా కిసాన్‌ రైలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

kissan trains
ఉద్యాన పంటలు
author img

By

Published : May 19, 2021, 11:58 AM IST

ఏడాదికోసారి మాత్రమే ఆదాయాన్నిచ్చే మామిడి పంటకు ధర ప్రశ్నార్థకమైంది. చిత్తూరు జిల్లాలో విస్తారంగా పంట సాగైంది. ఈ సీజన్‌లో దాదాపు 5 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ అంచనా. పంట కోతకు వచ్చినా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా వచ్చే వ్యాపారుల జాడ కానరావడం లేదు. టన్ను ప్రస్తుతం రూ.12 వేలు వరకు పలుకుతోంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

జిల్లాకు ప్రాధాన్యమేది?

ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా రవాణా చేయడంతో పాటు రైతులకు మంచి ధరలు దక్కాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టినవే కిసాన్‌ రైళ్లు. జిల్లాకు ఇప్పటి వరకు ఉపయుక్తంగా లేకపోయాయి. అనంతపురం, నూజివీడు నుంచి ఆదర్శనగర్‌(దిల్లీ)కు నడిపినా.. జిల్లాకు టమోటా ఎగుమతుల కోసం తూతూ మంత్రంగా ప్రవేశపెట్టి నిలిపివేశారు. ప్రస్తుతం మామిడితో పాటు వివిధ పంటల ఎగుమతికి సౌలభ్యం ఉంది. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం, రైల్వేశాఖ సహకరించడం ద్వారా రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది.

రైల్వే, ఉద్యానశాఖ అధికారుల వర్చువల్‌ సమావేశం

ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంగళవారం రైల్వే, ఉద్యానశాఖ అధికారులు, రైతు సంఘాలతో ప్రత్యేకంగా వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. గుజ్జు తయారీకి వినియోగించే తోతాపురి మినహా ఇతర రకాలను ఎగుమతికి ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో కిసాన్‌ రైల్లో 14 వరకు పార్సిల్‌ వ్యాన్లు ఉంటాయి. ఒక్కో వ్యాన్‌ సామర్థ్యం 23 టన్నులు వరకు ఉంటుంది. పూర్తి వ్యాన్‌ వినియోగించుకునే పక్షంలో ప్రత్యేక రైలు నడిపే అవకాశం ఉంటుంది. ఒకట్రెండుకు అయితే ఎక్స్‌ప్రెస్‌ రైలుతో అనుసంధానం చేస్తామని రైల్వే అధికారులు పూచీ ఇచ్చారు. ఇందుకు రైతులు, రైతు సంఘాలు ఎగుమతికి సిద్ధంగా ఉండాలని డీడీ కోరారు. పాకాల కేంద్రంగా ఎగుమతికి ఉపయుక్తంగా ఉంటుందని జూమ్‌ మీటింగ్‌లో నిర్ణయించారు.

వ్యాపారులతో ఒప్పందం

సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు జిల్లాకు చేరుకుని ఇక్కడి నుంచి ఎగుమతులు చేపట్టేవారు. ఈసారి ఎవ్వరూ రాలేదు. కరోనా రెండో దశ తీవ్రతతో వ్యాపారులు రావడంలేదని తెలిసింది. ఏటా వచ్చే వ్యాపారులతో సంప్రదించి వారు రానప్పటికీ అవసరమైన రకాలను ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం లాంటి ఒప్పందం చేసుకోవాలని సంకల్పించారు.

రవాణా రాయితీ

కిసాన్‌ రైలుతో రవాణా ద్వారా రైతులకు రాయితీ లభిస్తుంది. టన్నుకు రూ.5,200 వంతున చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాకు కిసాన్‌ రైలు నడపడం, రైతులకు ఉపయుక్తంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మామిడితో పాటు వివిధ కూరగాయాలు, పండ్ల ఎగుమతికి అవకాశం కల్పిస్తే ఇతర రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:

బ్లాక్‌ ఫంగస్‌ కలవరం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ధారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.