ETV Bharat / state

బీటలు వారిన పుత్తూరు ట్యాంక్.. మరమ్మతు పనులు ప్రారంభం - పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తాజా సమాచారం

చిత్తూరు జిల్లా పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టకు భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. పురపాలక సంఘ తాగునీటి అవసరాల కోసం దశాబ్దం క్రితం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్.. దాదాపు 500 మీటర్ల మేర కుంచించుకుపోతూ బీటలు వారింది. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేతృత్వంలో అధికారుల బృందం కట్టను పరిశీలించి మరమ్మతు పనులను ప్రారంభించారు.

summer storage tank
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
author img

By

Published : May 19, 2021, 9:28 AM IST

చిత్తూరు జిల్లా నగరిలోని పుత్తూరు పురపాలక సంఘం తాగునీటి అవసరాలను తీర్చేలా 2006లో సుమారు 55 కోట్ల రూపాయల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు. గాలేరు నగరి సుజల స్రవంతి పనులు పూర్తి చేసుకుని ఈ చెరువులోకి తరలించాలని నిర్ణయించారు. ఈ ట్యాంక్ నిర్మాణం 2011లో పూర్తైంది.

నేటికీ.. గాలేరు నగరి సుజల స్రవంతి పనులకు అతీగతీ లేక ట్యాంకు ప్రారంభం కాకుండా ఉండిపోయింది. కానీ గతేదాడి కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి నీళ్లు చేరుకున్నాయి. కొద్దిరోజుల్లో చెరువుల నుంచి పైప్ లైన్ల ద్వారా నీటికి కుళాయిలకు అందించాలని అధికారులు ప్రణాళిక రచిస్తున్న క్రమంలో.. చెరువు కట్టకు బీటలు వారి ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి.

అప్రమత్తమైన అధికారులు..

స్థానికులు సమస్యను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దృష్టికి తీసుకువెళ్లారు. శస్త్రచికిత్స అనంతరం చెన్నైలో విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్యే... స్థానిక ఇంజినీరింగ్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఆయనే నేరుగా వెళ్లి చెరువు కట్టను పరిశీలించారు. కట్ట తెగితే ఊరిలోకి నీరు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పగా.. ప్రస్తుతానికి ఇసుక బస్తాలు వేసి.. బీటలు వారిని చోట మట్టిని తెచ్చి పోసి చదును చేసేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి నుంచి ఇంజినీర్లను పిలిపించి చెరువు కట్ట బలోపేతానికి ఏం చేయాలన్న విషయంపై.. సలహాలు తీసుకుంటామన్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని.. ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

పేలుళ్లే కారణమా..

ఇంకా ప్రారంభం కాని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట బలహీనపడటానికి గల కారణాలపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. పరిసరప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న క్వారీల్లో చేసే పేలుళ్ల కారణంగా కట్ట బలహీనపడిందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

తల్లడిల్లుతున్న పల్లె.. రాకపోకలు పెరగడమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.