రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో పర్యటించిన ఆయన..రైతులు తాము పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేందుకే వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామన్నారు. ఈ చట్టాలను జీర్ణించుకోలేని కొన్ని ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.
అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు వాజ్పేయి బీజం వేశారన్నారు. అనేక జాతీయ రహదారులను నిర్మించి ప్రపంచ మనవైపు చూసేలా చేశాడన్నారు.
2024లో రాష్ట్రంలో భాజాపా అధికారంలోకి వస్తుందని..,ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం మండలంలోని పలు పార్టీలకు చెందిన నేతలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ భాజాపా అధ్యక్షుడు రామచంద్రుడు, రాష్ట్ర భాజాపా అధికార ప్రతినిధి శామంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి