చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపి అండగా నిలిచిన రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్‌ను మాజీమంత్రి సోమిరెడ్డి అభినందించారు. ఇకపై సోనూసూద్‌ను విలన్‌గా చూడలేనన్న సోమిరెడ్డి...సినిమాల్లో హీరో పాత్ర వేయాల్సిందేనని కోరారు. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశామన్న ఆయన...ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదని కొనియాడారు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో సోన్ సూద్ చొరవ అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి: ఆ రైతింట 'సోనూ'లిక ట్రాక్టర్