ETV Bharat / state

సోషల్​ మీడియాలో తితిదే, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం..కేసు నమోదు - తితిదే, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

తిరుమల శ్రీవారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై తితిదే విజిలెన్స్‌ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

social meida posts against ttd and ap government
తితిదే, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం
author img

By

Published : Aug 14, 2021, 10:02 AM IST

తితిదే, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శ్రీవారి 1500 కిలోల బంగారు నగలను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టుపెట్టినట్లు జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా పోస్టులు షేర్ చేశారని 18మందిపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుపతి పోలీసులకు పిర్యాదు చేశారు.

తితిదేకు చెందిన బంగారాన్ని ఏపీ ప్రభుత్వం ఎస్‌బీఐలో తాకట్టుపెట్టి అప్పు తెచ్చిందని.. మమ్మల్ని తరువాత కాపాడుదురు కాని.. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి స్వామీ.. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద’ అంటూ భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో దుష్ప్రచారం చేశారని విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన పార్టీ, పండుబుద్దాల పేర్లతో పాటు మరో 16 మంది ఈ దుష్ప్రచారం చేశారని అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని అధికారులంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్ట్‌లు పెట్టి షేర్‌ చేయడం మంచిది కాదని తితిదే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

'పఠాన్‌కోట్‌ దాడికి స్థానిక పోలీసుల సాయం'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.