చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో కూంబింగ్‌లో భాగంగా భీమవరం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 ఎర్ర చందనం దుంగలు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మంగళంపేట బీట్, పీలేరు రేంజ్ లారీ బాట వద్ద కొంత మంది ఎర్ర చందనం స్మగ్లర్లు రెండు కార్లలో దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వీరిని పోలీసు బృందాలు చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసు సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :