చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం జంగావాండ్లపల్లెకు చెందిన అక్కాచెల్లెళ్లు నెలరోజుల క్రితం అదృశ్యమయ్యారు . గత నెల 17 నుంచి అత్తవారి ఊరైన కడపజిల్లా సుండుపల్లిలో కనిపించకుండా పోయారు. అత్తవారింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుళ్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన అక్కాచెల్లెళ్లకు కడపజిల్లా సుండుపల్లి మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత అత్తింటి వేధింపులతో తరచూ గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో రాజీయత్నాలు జరిగాయి. అక్కాచెల్లెళ్లు గత నెల 17న అదృశ్యమయ్యారు.
అనుమానంతో అక్టోబరు 19న సుండుపల్లె పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి బంధువులు, తెలిసినవారి ఇళ్ల వద్ద వెతికినా తమ కుమార్తెల ఆచూకీ కనిపించలేదని. పోలీసులూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇదీ చదవండి:
అక్రమ నిర్బంధం వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు: హైకోర్టు