ఈనాడు-సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన శ్రావణ మహోత్సవ వేడుక తిరుపతిలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో మహిళలకు సంప్రదాయ వస్త్రధారణ, బ్యూటిఫుల్ స్మైల్, ఫోటో జెనిక్ ఫేస్, ర్యాంప్ వాక్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు బహుమతులు అందచేశారు. సంస్కృతీ, సంప్రదాయాల విశిష్ఠత తెలియచేసేలా... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆకెళ్ల విభీషణ శర్మ శ్రావణ మాస వైశిష్ట్యాన్ని మహిళలకు వివరించారు.
ఇవీ చదవండి...వైరల్: పోలీసునే పరుగులు పెట్టించిన మహిళ