ETV Bharat / state

విభిన్నం... విలక్షణం... ఎప్పుడూ ప్రజాపక్షం...

విలక్షణత ఆయన నైజం....రాజకీయాల్లో అయినా....సినిమాల్లో అయినా. చెప్పాలనుకున్న విషయాన్ని ఆయనకు చేతనైన ధోరణిలోనే తెలియచెప్పే విభిన్న మనస్తత్వం. సమైక్యాంధ్ర పోరాటం నుంచి ప్రత్యేక హోదా వరకు ఆయన నిరసన శైలి విభన్నం. తనకు అన్నం పెట్టిన కళతోనే....నవ్యాంధ్ర భవితను నిర్దేశించిన పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు. నాయకుడిగా ప్రజలు తనను ఎన్నుకున్నది వారి తరపున పోరాడటానికే అని నిరంతరం గుర్తుచేసుకునే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. పార్టీ అధ్యక్షుడు తన చిన్న నాటి స్నేహితుడే అయినా....నిరంతం కార్యకర్తగానే గడిపిన మనస్తత్వం ఆయనది. వెరసి రాష్ట్ర రాజకీయాల్లో నారమల్లి శివప్రసాద్​ది విభిన్న శైలి.

shivaprasad
author img

By

Published : Sep 21, 2019, 2:33 PM IST

మెరుగైన పాలనంటే మనం చెప్పుకోవడం కాదు... ప్రజలే చెప్పాలి అంటూ... ప్రతి సభలో తన ఖంగుమనే స్వరంతో చప్పట్లు కొట్టించే సాధారణ కార్యకర్త మనస్తత్వం .పార్టీ అధ్యక్షుడికి బాల్య స్నేహితుడైనా ఏనాడు అందలాలు కోరుకోని వ్యక్తిత్వం. మంత్రిగా.... రెండు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినా... తాను ఎప్పటికే పార్టీకి పెద్దకార్యకర్తనని చెప్పుకునే శివప్రసాద్.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని పులిత్తివారిపల్లిలో శివప్రసాద్....1951 జూన్ 10న జన్మించారు. నాగయ్య, చెంగమ్మ దంపతుల 8 మంది సంతానంలో శివప్రసాద్ మూడో వాడు. మగబిడ్డ కోసం తలకోన సిద్ధేశ్వరస్వామికి మొక్కుకున్న తల్లితండ్రులకు శివప్రసాద్ మూడో సంతానంగా జన్మించారు. మిగిలిన వారంతా ఆడపిల్లలే. శివుని దయతో జన్మించినందున తల్లిదండ్రులు శివప్రసాద్ అని పేరు పెట్టారు. శివప్రసాద్ బాల్యమంతా... పులిత్తివారిపల్లి, ఐతేపల్లి, చంద్రగిరిలో గడిచింది. ఐతేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్న ఆయన...ఆరో తరగతి నుంచి చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు.

చంద్రబాబు బాల్యస్నేహితుడు

అక్కడే తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో... శివప్రసాద్‌కు స్నేహం ఏర్పడింది. ఆరో తరగతి నుంచి ఎస్​ఎస్​ఎల్​సీ వరకూ ఇద్దరూ అదే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. తన బాల్యమిత్రుడు చంద్రబాబుతో గడిపిన సందర్భాలను తలుచుకోవటం శివప్రసాద్‌కు చాలా ఇష్టం. తన స్నేహితుడు దేశరాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారని ఎప్పుడూ గర్వంగా చెబుతుండేవారు.

అమ్మాయి వేషం వేయాలంటే అంటే చాలా ఇష్టం

చిన్ననాటి నుంచి నాటకాలంటే శివప్రసాద్‌కు విపరీతమైన ఆసక్తి . మరీ ముఖ్యంగా ఆడపిల్ల వేషం వేయటం అంటే ఆయనకు సరదా. పాఠశాల స్థాయి నుంచే నాటకాల్లో నటించేవారు. అలా అని చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన శివప్రసాద్... తిరుపతిలో కొంతకాలం పాటు వైద్యుడిగా పనిచేశారు.

ఇద్దరు కుమార్తెలు

1972 ఫిబ్రవరి 26న వైద్యురాలు విజయలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. శివప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు. వైద్యురాలైన పెద్దకుమార్తె మాధవీలత ఎస్వీ వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండో కుమార్తె నీలిమ వైద్యురాలే. ఇలా కుటుంబం మొత్తం వైద్య వృత్తిలో ఉండటం విశేషం. రెండో కుమార్తె నీలిమ భర్త నరసింహ ప్రసాద్... రైల్వే కోడూరు నియోజకవర్గం తెదేపా ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరపున పోటీచేసి పరాజయం పాలయ్యారు.

తనదైన శైలి నటనతో ప్రత్యేక గుర్తింపు

వైద్యవృత్తిలోకి వచ్చినపటి నుంచి శివప్రసాద్ తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. స్వతహాగా నటనపై ఆయనకున్న ఆసక్తితో పలు చిత్రాల్లోనూ నటించారు. చిన్న చిన్న పాత్రలతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. 1983లో చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రంలోని పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

రోజాకు బ్రేక్‌ ఇచ్చిన వ్యక్తి

ఇక అక్కడి నుంచి ఆదివారం ఆడవాళ్లకు సెలవు, యముడికి మొగుడు, మాస్టర్ కాపురం, సత్యభామ వంటి చిత్రాల్లో నటించారు. ప్రేమతపస్సు, టోపీరాజా స్వీటీరోజా, ఇల్లాలు, కొక్కొరోక్కో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి, ప్రస్తుత వైకాపా నాయకురాలు ఆర్కే రోజా సినీ కెరీర్‌కు 'ప్రేమతపస్సు' సినిమాతో శివప్రసాద్ ఊతమిచ్చారు. ఆమె ఆ అభిమానాన్ని పార్టీలకతీతంగా ఇప్పటికీ చాటుకుంటూనే ఉంటారు.

1999 లో రాజకీయ అరంగేట్రం- 2019తో నిష్క్రమణ....

ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని తన బాల్యమిత్రుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు 1998లో శివప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారిగా 1999 ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో 1999 నుంచి 2002 వరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా శివప్రసాద్ పనిచేశారు.

ప్రజాసేవ చేస్తూనే... నటించిన శివప్రసాద్‌

అయితే అనూహ్యంగా అదే సమయంలో ఆయన సినిమా కెరీర్ మళ్లీ ఊపందుకుంది. యువతరం కథానాయకుల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా శివప్రసాద్ విలక్షణమైన పాత్రలు పోషించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన బాలు, వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి చిత్రాలు ఆయన నటనకు డిమాండ్‌ను పెంచాయి. అక్కడి నుంచి వరుసగా సుభాష్ చంద్రబోస్, దొంగ, బలాదూర్, తులసి, మస్కా, దూసుకెళ్తా, ద్రోణ, కుబేరులు, ఆటాడిస్తా, కితకతలు, డేంజర్, జై చిరంజీవ, ఒక్క మగాడు, పిల్లజమీందార్ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 'దొంగ' సినిమాలో నటనకుగాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. డేంజర్ చిత్రంలో శివప్రసాద్ నటనకు అవార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలందాయి. మోహన్‌బాబు 'గాయత్రి', సప్తగిరి ఎల్​ఎల్​బీ....... చిత్రాల తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలకు దూరయమ్యారు.

సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించిన ఎంపీ

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే..... మరోవైపు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2004లో సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత ఆయన మరింతగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అనుంగ అనుచరుడిగా...దాదాపు చిత్తూరు జిల్లాలో తెదేపా రాజకీయాలను పర్యవేక్షించేవారు. 2009లో కాంగ్రెస్ హవాలోనూ చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తొలిసారిగా పార్లమెంటులో తెలుగువాడి వాణి వినిపించారు. ప్రత్యేకించి రాష్ట్ర పునర్విభజన సమయంలో సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు.

వివైధ్య నిరనసలకు కేరాఫ్‌

2014లో తిరిగి చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన శివప్రసాద్ అఖండ విజయం సాధించారు. ఈ సారి ప్రత్యేకహోదా నినాదాన్ని పార్లమెంట్ లో ఆయన ప్రతిబింబించిన తీరు అమోఘం. తనకున్న నటనా చాతుర్యంతో...పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నన్నీ రోజులు...రోజుకొక వేషంతో సభకు హాజరవుతూ...ఓ నటుడిలో కళావిద్వత్తను యావత్ దేశానికి తెలియచేశాడు. నారదుడి వేషం దగ్గర నుంచి....వృద్ధురాలి వేషం వరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరైనప్పుడు ఆయన వేసిన ప్రతి వేషం నభూతో నభవిష్యతి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం శివప్రసాద్ నటనకు....ఆయనలోని నిబద్ధతకు ముగ్దురాలై ప్రశంసించటం...శివప్రసాద్ వినిపించిన బలమైన నినాదాలకు ప్రతీక. 2019 ఎన్నికల్లో వైకాపా ఎంపీ రెడ్డప్ప చేతిలో పరాజయం పాలయ్యారు.

అధినేతకు స్నేహితుడైనా కార్యకర్తగానే పార్టీకి సేవలు

ప్రత్యేకించి చిత్తూరు ఎంపీగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతగానో పేరు తెచ్చాయి. వెనకబడిన ప్రాంతం నుంచి అత్యాధునిక సాంకేతికత వినియోగించే ప్రాంతంగా పేరుతెచ్చుకున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధిలో శివప్రసాద్ ది కీలకపాత్ర. చిత్తూరు- పలమనేరు, చిత్తూరు- నాయుడుపేట, కుప్పం- కృష్ణగిరి నాలుగు, ఆరు వరస రహదారుల నిర్మాణం తనకు అత్యంత సంతృప్తినిచ్చే శివప్రసాద్ చెప్పుకునే వారు. తాను నటుడిగా....రాజకీయ వేత్తగా ఎంత ఎదిగినా...తనలోని నటుడిని ప్రజలు ఆదరించటంతోనే సాధ్యమైందని వినమ్రంగా చెప్పుకునే వారు. తెదేపా అధ్యక్షుడు అంతటి వాడే స్నేహితుడైనా...కేవలం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తూ....అలానే తన రాజకీయాలను కొనసాగించిన నిబద్ధత ఆయనలోని నీతినిజాయితీలకు తార్కాణం. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న శివప్రసాద్ తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందారు. అనంతంరం వైద్యుల సూచన మేరకు చెన్నైలో అపోలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు

Intro:కర్నూలు జిల్లా మహానంది మండలం అబ్బీపురం గ్రామ పరిధిలోని పొలంలో వింత చోటు చేసుకుంది. గొల్ల రాముడు పొలంలోని బోరులో మోటారు వేయకుండానే నీరు ఉబికి వస్తోంది. Body:నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు ఈ విధంగా వస్తున్నట్లు స్థానికులుConclusion:చర్చించుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

shivaprasad
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.