చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాల పీజీ వైద్యురాలి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వైద్యులకు ఎస్వీ వైద్యకళాశాలలో తిరిగి నియమించడంపై ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాల కూడలిలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. బాధ్యులను విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
2018 ఆగస్టులో ఓ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో డా.కిరీటీ, డా.శశికుమార్‌ను సస్పెండ్ చేసి నెల్లూరు వైద్యకళాశాలకు బదిలీ చేశారు. వైద్యురాలి మృతికి సంబంధించి ఓ వైపు విచారణ సాగుతుండగానే బాధ్యులను విధుల్లోకి తీసుకోవడం, తిరిగి తిరుపతికి బదిలీ చేయడంపై ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
ఇదీ చూడండి: