ETV Bharat / state

లైంగిక వేధింపులతో... ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం - tirupathi crime news

తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తోన్న ఒప్పంద ఉద్యోగినిపై వర్శిటీ ఉద్యోగులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, మహేంద్రలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.... అవమానభారంతో ఆమె... ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసుల నమోదు చేశారు.

లైంగిక వేధింపులతో... తిరుపతి పశువర్శటి ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యయత్నం
author img

By

Published : Nov 8, 2019, 12:09 AM IST

లైంగిక వేధింపులతో... తిరుపతి పశువర్శటి ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యయత్నం

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువైద్య కళాశాలలోని పశు గణోత్పత్తి విభాగంలో గత శుక్రవారం విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు కార్యాలయ సహాయకులు మద్యం సేవించారు. మద్యం మత్తులో మహిళా ఉద్యోగినిని సైతం బలవంతంగా మద్యం తాపించినట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం మత్తులో ఆమె పై ఆత్యాచారానికి యత్నించారు. ఆమె వ్యతిరేకించి బయటకు పరుగులు తీసింది. మరుసటి రోజు అధికారులకు తెలియడంతో వారిని పిలిచి రాజీ చేశారు. దీంతో మనస్తాపానికి చెందిన ఉద్యోగిని సోమవారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించారు. ఆఖరి క్షణంలో విషయం బయటకు రావడంతో దళిత సంఘాల నాయకులు పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ఆత్యాచారానికి యత్నించిన ఉద్యోగులు మహేంద్రయ్య, శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డిలను విశ్వవిద్యాలయ అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించి ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఇవీ చదవండి

లైంగిక వేధింపుల ఆరోపణలతో..అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.