చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట బీసీ కాలనీకి చెందిన పి.శారద.. వ్యవసాయ కూలీ, దళిత, గిరిజ సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు. సభ్యుల సమస్యలపై ఆమె తరచూ అధికారులను కలిసేవారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల క్రితం ఎస్టీ సంఘాల ద్వారా బి.కొత్తకోట ఎస్ఈబీ సీఐగా పనిచేస్తున్న మోహన్.. చిత్తూరు కలెక్టరేట్ వద్ద పరిచయమయ్యారు.
సంఘాల ద్వారా ఆమె ఫోన్‌నెంబరు తీసుకుని అసభ్య పదజాలంతో మాట్లాడేవాడు. ఆమె వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఫోన్ చేయలేదు. తాజాగా తన భర్త, పిల్లలు లేని సమయంలో ఫోన్‌చేసి ఇంటి వద్దకు వస్తున్నానని చెప్పి భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల నుంచి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎస్ఈబీ సీఐపై 354 డీ, 509 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు భాకరాపేట ఎస్ఐ శ్వేత తెలిపారు.
ఇదీ చదవండి: