రాష్ట్రంలో పంచాయతీ రెండవ దశ ఎన్నికల సందర్భంగా ఆంధ్రా - కర్నాటక సరిహద్దు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని చీకల బైలు చెక్ పోస్ట్ వద్ద కర్నాటక నుంచి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కర్నాటక నుంచి కొందరు అక్రమ మార్గాల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతను పెంచామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు