ETV Bharat / state

అక్రమాలపై ఎస్​ఈబీ ఉక్కుపాదం

చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో... ఇసుక అక్రమాలు, మద్యం రవాణాపై దాడులు, అవగాహనా సదస్సులు, పరివర్తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా చేసిన వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేశారు.

seb-rides-on-illegal-wine-plents-sand-dumps-and-gutka-in-chitthore-district
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సెంథిల్ కుమార్
author img

By

Published : Aug 20, 2020, 10:47 PM IST

ఎస్​ఈబీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ... అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీ ప్రాంతాలు, గుట్కా స్థావరాలపై దాడులు చేసి 1,275 కేసులు నమోదు చేసి 1,326 మందిని అరెస్ట్ చేశారు. 38,426 సీసాల మద్యం, 1,960 టెట్రా పాకెట్ల మద్యం, 9,291 లీటర్ల నాటు సారా, 3,89,563 లీటర్ల నాటుసారా ఉటను ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకొన్న మద్యం విలువ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు.

సుమారు 3 వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని 180 కేసులు నమోదు చేసి 278 మందిని అరెస్ట్ చేసి, 226 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో 101 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సరిహద్దు నుంచి మద్యం అక్రమ రవాణాపై ప్రతేక నిఘా ఉందని, ప్రజలు కూడా తమ వంతు భాద్యత గా తమ పరిసరాల్లో ఎవరైనా ఇసుకను, మద్యంను, అక్రమ రవాణాకు పాల్పడితే 94409 00004 కు గాని, డయల్ 100 కు గాని, పోలీసు వాట్సాప్ నంబర్​కు 94409 00005 కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు అని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరములు పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇదీ చదవండి:

ఏపీ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికారులకు అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.