ETV Bharat / state

అధికార పార్టీ నేతలమంటూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు - Madanapalle mandal latest news

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని ఓ సర్పంచ్​.. తమ ప్రాంత ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే అధికార పార్టీ నేతలమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.

sarpanch
అధికార పార్టీ నేతలమంటూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు
author img

By

Published : Mar 17, 2021, 1:36 PM IST

మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఆ గ్రామ సర్పంచ్​ ఆనంద్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి ఆదేశాలు లేకుండా ప్రొక్లెయినర్​లతో తవ్వకాలు జరుపుతున్నారని విమర్శించారు. పనులు ఆపాలని కోరినా వారు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఆ భూమిని ఓ సంఘానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం పంచాయతీకి సంబంధం లేని బయటి వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదన్నారు.

ఇదీ చదవండీ.. తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.