ETV Bharat / state

Municipal Elections: దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు నిద్రపోతున్నారా ?: సజ్జల - ఏపీ మున్సిపల్ ఎన్నికలు

దొంగ ఓట్లు (Fake votes) వేయించుకునే అలవాటు వైకాపాకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala Ramakrishna reddy) అన్నారు. కుప్పంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోందని.., అయినా దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు (TDP polling agents) నిద్రపోతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. స్థానికేతరులతో ఎవరు ఓటేయిస్తున్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యనించారు.

దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు నిద్రపోతున్నారా ?

author img

By

Published : Nov 15, 2021, 4:04 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ (Kuppam muncipal elections) ఎన్నికల్లో దొంగఓట్లు వేస్తున్నారన్న చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala Ramakrishna reddy on fake votes) స్పందించారు. దొంగ ఓట్లు వేయించుకునే అలవాటు వైకాపాకు లేదని సజ్జల స్పష్టం చేశారు. కుప్పంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోందని..,అయినా దొంగ ఓట్లు వేస్తుంటే తెదేపా ఏజెంట్లు (TDP polling agents) నిద్రపోతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. స్థానికేతరులతో ఎవరు ఓటేయిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. మంచి పాలనకు ప్రజలు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని సజ్జల వ్యాఖ్యనించారు.

చంద్రబాబు ఏమన్నారంటే..

చరిత్రలో ఏనాడు ఎన్నికలను ఇంత అపహాస్యం చేయలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు (Fake votes) వేస్తున్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై..మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో (CBN media conference) మాట్లాడారు. "వైకాపా నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్‌ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా ? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా ? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు." అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అడుగడుగునా నీచ రాజకీయాలు..

"పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కుప్పంలో రాత్రే దొంగ ఓటర్లను తెదేపా నేతలు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకోకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారు. దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

నిర్వహణ చేతకాకుంటే వెళ్లిపోవాలి..

"ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే శిక్ష తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలి. అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్ఈసీ (SEC) వెళ్లిపోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘంలోని వారికి వారి ఉద్యోగాలే ముఖ్యం. ఎస్ఈసీ అధికారులు గుమాస్తాలు మాదిరి తయారయ్యారు. వైకాపాకు, జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. జగన్​ సీఎంగానే కాదు.. రాజకీయాల్లో ఉండేందుకే అనర్హులు." అని చంద్రబాబ ఘాటు విమర్శలు చేశారు.

ఇవీ చదవండి

ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా ? - చంద్రబాబు

KUPPAM ELECTIONS: కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.