ETV Bharat / state

'పండగకు ముందు 100.. తరువాత 200 సర్వీసులు'

author img

By

Published : Jan 12, 2021, 11:48 AM IST

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్టీసీకి సంక్రాంతి పండగ ఆశాదీపంలా మారినట్లు కనిపిస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆర్టీసీ పరిధిలో ఉన్న బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచారు.

tirupathi rtc bus services
తిరుపతి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు

కరోనా మహమ్మారి కారణంగా నిన్నమొన్నటి వరకు మందకొడిగా సాగిన ఆర్టీసీ సర్వీసులు వేగం పుంజుకుంటున్నాయి. ప్రత్యేకించి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తిరుపతి ఆర్టీసీ పరిధిలో బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచారు. సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు రద్దీకి అనుగుణంగా సర్వీసులు తిప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్లు తక్కువ సర్వీసులు కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీ...తిరిగి గాడిన పడేలా అవకాశాలను అందిపుచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు

తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీనివాసుడి దర్శనాల కోసం వచ్చే భక్తులతో కిటకిటలాడిపోయే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కరోనా మహమ్మారి కారణంగా ప్రాభవాన్ని కోల్పోయింది. భారీగా ఆదాయాన్ని తీసుకువచ్చే సర్వీసులన్నీ చాన్నాళ్లుగా నిలిచిపోవటంతో లాభాలను అసలేమాత్రం కళ్లచూడని పరిస్థితులు నెలకొన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని మూడు ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి పునర్వైభవాన్ని సాధించే దిశగా తిరుపతి ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం సంక్రాంతి సీజన్ నుంచే తిరిగి గాడిన పడేందుకు సర్వీసులను పునరుద్ధరిస్తోంది.

సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా సర్వీసులపై దృష్టి సారించారు. ఎక్కువగా తిరుపతి- విశాఖపట్నం, తిరుపతి- అనంతపురం, తిరుపతి- కడప మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు సంక్రాంతికి ముందు ఆయా మార్గాల్లో 100 సర్వీసులను, పండుగ సెలవుల తర్వాత 200 సర్వీసులను నడపాలని నిర్ణయించారు.

అంతరాష్ట్ర సర్వీసులను గణనీయంగా నడిపే తిరుపతి ఆర్టీసీ...కరోనా కారణంగా రాష్ట్రాల మధ్య ఆంక్షలతో దాదాపు 8నెలలపాటు సర్వీసులను నిలిపివేసింది. ఐతే సడలింపుల తర్వాత ఒక్కో సర్వీసును పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని తిరుపతి- బెంగుళూరుల మధ్య 60 నుంచి 70 సర్వీసులను తిప్పాలని నిర్ణయించింది. గతంలో తిప్పిన 120 సర్వీసులతో పోలిస్తే ఇవి తక్కువైనప్పటికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులందరూ ఇప్పటికీ ఇంటినుంచే పనులు చేస్తుండటంతో రద్దీ తక్కువగానే ఉంటుందని అంచనావేస్తోంది.

అలాగే మరో ముఖ్యమైన రూటైన తిరుపతి- తమిళనాడు సర్వీసులను సైతం భారీగా పెంచేందుకు సన్నాహకాలు చేస్తోంది. తిరుపతి- చెన్నై, తిరుపతి-కంచి, తిరుపతి-వేలూరు, తిరువణ్ణామలైల మధ్య సర్వీసులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది..

తిరుమల శ్రీవారి దర్శనాలను తితిదే పరిమిత సంఖ్యలోనే నిర్వహిస్తుండటంతో ఘాట్​లో బస్సు సర్వీసులను తక్కువ సంఖ్యలోనే ఆర్టీసీ తిప్పుతోంది. జిల్లా వ్యాప్తంగా పల్లెవెలుగు సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించింది. బస్సు సర్వీసులను సుదీర్ఘ లాక్​డౌన్ తర్వాత ప్రవేశపెట్టినప్పుడు రోజుకు 8లక్షలుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం కోటి 20 లక్షలకు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అద్దెబస్సులను సైతం సిద్ధంగా ఉంచామంటున్న అధికారులు...ప్రయాణికులకు అవసరమైన పక్షంలో బస్సులను అందుబాటులో ఉంచేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: 'ఎన్నికలంటే ప్రభుత్వానికి భయమెందుకు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.