ETV Bharat / state

'అలిపిరి-తిరుమల నడకదారి పైకప్పు పనులు దాదాపు పూర్తి'

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు దాదాపు పూర్తయ్యాయని తితిదే ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుంచి నామాల గోపురం వ‌ర‌కు నిర్మించిన పైక‌ప్పును, మార్గమ‌ధ్యలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

author img

By

Published : Sep 29, 2021, 9:33 PM IST

తితిదే ఈఓ జవహర్ రెడ్డి
తితిదే ఈఓ జవహర్ రెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు దాదాపు పూర్తయ్యాయని తితిదే ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల‌లో అలిపిరి కాలినడక మార్గం నుంచి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నట్లు వెల్లడించారు.

అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడకదారి పైకప్పు పనులను అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డితో క‌లిసి పరిశీలించారు. దాత‌ల‌ స‌హ‌కారంతో ఈ పనులు చేసినట్లు ఈవో తెలిపారు. మ‌రిన్ని అభివృద్ధి, ప‌చ్చద‌నం పెంపొందించే కార్యక్రమాలను తితిదే కొనసాగిస్తుందని తెలిపారు. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుంచి నామాల గోపురం వ‌ర‌కు నిర్మించిన పైక‌ప్పును, మార్గ మ‌ధ్యలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఇదీ చదవండి: TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.