రాగిపాత్రకి అతీత శక్తులు ఉన్నాయంటూ రైస్ పుల్లింగ్ చేస్తున్న 13 మంది సభ్యుల ముఠాను చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనం, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ 13 మంది సభ్యులు ఓ బృందంగా ఏర్పడి.. రాగి పాత్రకు మహిమలు ఉన్నాయంటూ రైస్ పుల్లింగ్ చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు. రాగి పాత్రకు రంగు వేసి టార్చ్‌లైట్ దానివైపు వేస్తే.. లైట్ దానంతటదే ఆరిపోతుందని.. బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఈ పాత్రకి ఉందని నమ్మించారు. ఈ పాత్రకి ఉన్న మహిమల ద్వారా.. మేలు జరుగుతుందని నమ్మిస్తూ..మదనపల్లెలో రెండు కార్లలో తిరుగుతున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి