చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని సదాశివపురం వద్ద కోన కాలువ వరదలో చిక్కుకున్న గిరిజనులు క్షేమంగా బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న శివగిరి కాలనీలోని 11 మంది గిరిజనులను సహాయక సిబ్బంది క్షేమంగా వాగు దాటించారు. దీంతో అధికారులతోపాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆహార పదార్థాలు అందజేశారు.
ఇవీ చూడండి...