శేషాచలం అటవీ ప్రాంతంలో పద్దెనిమిది ఎర్రచందనం దుంగలతో పాటు 16 గొడ్డళ్లు, ఇతర వస్తువులను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలం కరకంబాడీ రోడ్డులో హరిత కాలనీ సమీపంలో కూంబింగ్ చేపట్టారు. పోలీసులను చూసి స్మగ్లర్లు.. దుంగలను పడేసి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో హుస్సేన్ అనే కానిస్టేబుల్ గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 20 మంది స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వారు వదిలి వెళ్ళిన వస్తువుల్లో ఎర్రచందనం దుంగలు, గొడ్డళ్లు, భక్తుని వేషంలో సంచరించేలా ఎరుపు, పసుపు దుస్తులు, టాబ్లెట్లు, బ్యాగులు ఉన్నాయి. బ్యాగ్లో లభించిన ఆధార్ కార్డు ద్వారా స్మగ్లర్లు.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. డీఎస్పీ వెంకటయ్య, ఆర్ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: