ఎర్ర చందనం అక్రమ రవాణాలో రాటుతేలిన సురేష్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగర శివారులో తనిఖీలు చేపట్టిన అధికారులు... వినాయకసాగర్ వద్ద అరెస్ట్ చేశారు. సురేష్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ అని టాస్క్ ఫోర్స్ అధికారి పి.రవిశంకర్ తెలిపారు.
ఇతనిపై ఇంతకముందే కొన్ని కేసులు ఉండగా పరారీలో ఉన్నాడు. తిరుచానూరు సమీపంలో కుక్కల పెట్ ఫామ్ పెట్టుకుని, ఆ ముసుగులో ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తుంటాడని తెలిపారు. తమిళనాడు నుంచి స్మగ్లర్లును పిలిపించి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంటాడని చెప్పారు. కేసు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం