శేషాచల అడవుల్లో టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ, పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నప్పటికీ.. తమిళ స్మగ్లర్లు వెనకంజ వేయడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒకచోట తమిళ స్మగ్లర్ల నుంచి అధికారులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అటవీప్రాంతంలో... అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. వాకిలిగుట్ట వద్ద అధికారులకు సుమారు 35 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దట్టమైన అడవిలోకి పారిపోయారు. పరిసర ప్రాంతాలలో గాలింపులు చేపట్టి... 33 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం శేషాచలం అడవుల్లో గాలిస్తున్నారు.
ఇదీ చదవండీ... నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు