చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న శేషాచల అడవులు స్మగ్లర్లతో నిండింది. గత కొన్నిరోజులుగా అటవీశాఖ అధికారులు అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని అడవులలో స్మగ్లర్ల ఉనికి తెలియడంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. తలకోన ఆటవీ ప్రాంతంలోని మర్రిమానుదడి వద్ద 14 మంది స్మగ్లర్లు తారసపడ్డారు.అధికారులను చూసి దుంగలను పడేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. సమీప ప్రాంతాలను పరిశీలించిన అధికారులకు 13 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: అటవీ అధికారులపై తిరుపతి పోలీసుల అసహనం... తమిళ స్మగ్లర్లు లేరని చెప్పడంపై అభ్యంతరం