చిత్తూరు జిల్లా చంద్రగిరి కల్యాణి డ్యాం సమీపంలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. డ్యామ్ సమీపంలో నాగపట్ల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యదళం కూంబింగ్ చేస్తుండగా రామిరెడ్డి పల్లికి చెందిన పెండి సురేశ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా శ్రీకాళహస్తి సమీపంలోని సదాశివపురానికి చెందిన తన బామమరుదులు ముగ్గురు అడవిలోకి వెళ్లారని,వారి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అడవిలోకి వెళ్లిన ముగ్గురు ఎర్ర చందనం దుంగలతో కల్లేటి వాగు చేరుకోగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిలో ఒక వ్యక్తి స్మగ్లింగ్ ఫైనాన్షియర్ గా అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి-పూటుగా తాగాడు.. పోలీసులపైనే చిందులేశాడు...