ETV Bharat / state

వైభవంగా శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి పూజలు - ramakrishna theertha mukkoti pooja in tirumala news

తిరుమలలో శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ మంత్రోచ్ఛారణలతో శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ కృష్ణ స్వాములకు తితిదే ప్రత్యేక పూజలు నిర్వహించింది. కరోనా దృష్ట్యా కార్యక్రమాలను ఏకాంతంగా జరిపించారు.

ttd
శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి పూజలు
author img

By

Published : Jan 29, 2021, 10:08 AM IST

తిరుమలలో శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి పూజలు

తిరుమలలో శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటిని తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, సిబ్బంది పూజా సామాగ్రితో శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. తీర్థంలో కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ కృష్ణ స్వాములకు మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధద్రవ్యాల‌తో అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి... అక్కడే తయారు చేసిన ప్రసాదంతో నైవేద్యం స‌మ‌ర్పించారు. ప్రతిఏటా పుష్యమి మాసంలో... పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి తితిదే నిర్వహిస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని తీర్థంకు ప్రతి ఏడాదీ ఎక్కువ మంది భ‌క్తులు హాజరై స్నానాలాచరిస్తారు. కరోనా కారణంగా భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పూజా కార్యక్రమాల‌ను ఆలయాధికారులు ఏకాంతంగా నిర్వహించారు.

ఇదీ చదవండి: ఉత్స‌వాల వివ‌రాలను ప్రకటించిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.