సుదీర్ఘ విరామం తరువాత తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే యాత్రికులకు స్వాగతం పలికేలా వర్షం కురిసింది. చిరుజల్లులలో తడుస్తూ.. మనసును పులకరిపజేసే ప్రకృతిసోయగాల మధ్య కనుమ దారుల్లో, అలిపిరి మెట్ల మార్గాన భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. వర్షంలోనే.. స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఏడుకొండలపై చినుకులు పడుతున్న దృశ్యాలు.. భక్తులను కట్టిపడేస్తున్నాయి.
ఇదీ చూడండి. వందేళ్ల భాగ్యనగర బోనాల చరిత్రలో కరోనాతో కొత్త మార్పు