రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లు రద్దవగా(Trains cancelled with rains in AP), మరికొన్నింటిని వేరే వార్గాలకు మళ్లించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటన చేశారు. నెల్లూరు - పడుగుపాడు మార్గంలో పలు రైళ్లు రద్దు చేయడంతోపాటు మళ్లింపు చర్యలు చేపట్టారు. మొత్తం 18 రైళ్లు రద్దు చేయగా.. మరో రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో ఆయా మార్గాల గుండా వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చేంత వరకూ తమకు రైళ్లు రద్దయినట్లు ఎటువంటి సమాచారం లేదని(Travelling problems due to trains cancelation) వాపోతున్నారు. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న తమకు అప్పటికప్పుడు రైళ్లు రద్దు చేస్తే.. గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం తమకు ముందస్తు సమాచారం ఇస్తే తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారమని అంటున్నారు. అత్యవసర ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రద్దైన, మళ్లించిన రైళ్ల వివరాలు..
నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో.. అధికారులు నెల్లూరు- పడుగుపాడు మార్గంలో 21 రైళ్లను రద్దు చేసి.. 10 రైళ్లను మళ్లించారు. రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయగా.. ఒక రైలు వేళల్లో మార్పు చేశారు.
రైలు నంబర్ | రైలు పేరు | |
20895 | రామేశ్వరం- భువనేశ్వర్ | రైలు రద్దు |
22859 | పూరి- చెన్నె సెంట్రల్ | రైలు రద్దు |
17489 | పూరి- తిరుపతి | రైలు రద్దు |
12655 | అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ | రైలు రద్దు |
12967 | చెన్నై సెంట్రల్- జైపూర్ | రైలు రద్దు |
06426 | నాగర్‌సోల్- తిరువనంతపురం | రైలు రద్దు |
06427 | తిరువనంతపురం- నాగర్‌సోల్ | రైలు రద్దు |
06425 | కొల్లాం- తిరువనంతపురం | రైలు రద్దు |
06435 | తిరువనంతపురం- నాగర్‌సోల్ | రైలు రద్దు |
12863 | హౌరా- యశ్వంతపూర్ | రైలు రద్దు |
12269 | చెన్నై సెంట్రల్- హజరత్ నిజముద్దీన్ | రైలు రద్దు |
12842 | చెన్నై సెంట్రల్- హౌరా | రైలు రద్దు |
12656 | చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ | రైలు రద్దు |
12712 | చెన్నై సెంట్రల్- విజయవాడ | రైలు రద్దు |
12510 | గువహటి- బెంగళూరు కంటోన్మెంట్ | రైలు రద్దు |
15930 | న్యూ తినుసుకియా - తాంబరం | రైలు రద్దు |
17651 | చెంగల్‌పట్లు- కాచిగూడ | రైలు రద్దు |
20890 | తిరుపతి- హౌరా | రైలు రద్దు |
12798 | చిత్తూరు- కాచిగూడ | రైలు రద్దు |
17487 | కడప- విశాఖపట్నం | రైలు రద్దు |
తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ | రైలు రద్దు |
తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లు:
రైలు నంబర్ | తాత్కాలికంగా నిలిపివేసిన రైలు పేరు |
15906 | డిగ్రూఘర్- కన్యాకుమారి రైలు న్యూ జగపాయిగురి- కన్యకుమారి మధ్య తాత్కాలికంగా నిలిపివేత |
12708 | హజరత్‌నిజముద్దీన్- తిరుపతి రైలు బిట్రగుంట- తిరుపతి మధ్య తాత్కాలికంగా నిలిపివేత |
ఆలస్యంగా నడిచే రైలు:
రైలు నంబర్ | రైలు పేరు | రైలు ఆలస్య సమయం |
13351 | దన్బాద్- అలపుజహ రైలు | సుమారు మూడు గంటలు ఆలస్యం |
మళ్లించిన రైళ్లు:
రైలు నంబర్ | మళ్లించిన రైళ్లు | |
12642 | హజరత్ నిజముద్దీన్- కన్యాకుమారి | రైలు మళ్లింపు |
12616 | న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్ | రైలు మళ్లింపు |
22877 | హౌరా- ఎర్నాకులం | రైలు మళ్లింపు |
12845 | భువనేశ్వర్- బెంగళూరు కంటోన్మెంట్ | రైలు మళ్లింపు |
22502 | న్యూ తినుసుకియా- బెంగళూరు | రైలు మళ్లింపు |
12270 | హజరత్ నిజముద్దీన్- చెన్నై సెంట్రల్ | రైలు మళ్లింపు |
12655 | అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ | రైలు మళ్లింపు |
12622 | న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్ | రైలు మళ్లింపు |
12296 | దానపూర్- బెంగళూరు | రైలు మళ్లింపు |
12968 | జైపూర్- చెన్నై సెంట్రల్ | రైలు మళ్లింపు |
ఇదీ చదవండి:
Floods in AP: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు - సీఎం జగన్