తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటుడు అక్కినేని అఖిల్, భాజపా నేత భగవాన్లాల్, ఉడిపి మఠం పీఠాధిపతి శ్రీ విద్యావల్లభతీర్థ సాహ్ని స్వామి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి..ప్రత్యేక పూజల ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆరెస్సెస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అమరావతిలో జరగనున్న అఖిల భారత్ ప్రచారక్ల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన..మోహన్ భగవత్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. పండితుల వేదాశీర్వవచనం అనంతరం..ఈవో కోటేశ్వరమ్మ కనకదుర్గ చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఇవీ చదవండి...ఈనెల 16 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత