సీఏఏ, ఎన్పీఆర్, ఎన్పీఆర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... చిత్తూరు నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గాందీ విగ్రహ కూడలిలో సభ నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
పీలేరు నియోజకర్గంలో మస్లింలు ఆందోళన చేపట్టారు. ముడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చిన ముస్లిం మహిళలు పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలికిరిలో ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.
మదనపల్లిలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ముస్లిం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత జీవనంలో చిచ్చు పెట్టటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు బిల్లులకు వ్యతిరేకంగా బహింరగ సభ నిర్వహించారు. భాజపా మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యనించారు.
ఇదీ చదవండి: