నేతల మాటల తూటాలతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలుగు దేశం తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తిరుపతి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
వారు గెలిస్తే లాభముండదు : లోకేశ్
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు తలాడించే వైకాపా ఎంపీలతో లాభం ఉండదని లోకేశ్ విమర్శించారు.
'తిరుపతి స్థానం మాదే'
తిరుపతి లోక్‌సభ స్థానం తమదేనంటూ.. వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని కట్టబెడతాయని స్పష్టం చేశారు.
వారి గెలుపు నిష్ప్రయోజనం : కన్నా
శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించిన భాజపా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ.. అధికార పార్ఠీ గెలిస్తే ఆ పార్టీ బలం పెరుగుతుంది తప్ప.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓటర్లకు సూచించారు.
'కాంగ్రెస్ గెలిస్తేనే'
భాజపా, వైకాపా దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌ను గెలిపించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అభ్యర్థించారు.