చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలోని తొండవాడ వద్ద టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన అధికారులు వారిని వెంబడించి 28 ఎర్రచందనం దుంగలు, రెండు కత్తులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.