చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అత్తూరులో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడింది. పొలానికి వెళ్తూ కాలుజారి అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో సుబ్బమ్మ (80) పడిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి బావిలోని పైపును పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులు విని అక్కడకు చేరుకున్నవారు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలికి చేరుకున్న గాజులమండ్యం కానిస్టేబుళ్లు.. బావిలోకి మంచం దించి తాళ్ల సాయంతో వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు. చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు శివకుమార్, మహేశ్‌లను తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు అభినందిస్తూ రివార్డు ప్రకటించారు.
ఇవీ చదవండి: