చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండల పరిధిలోని రెడ్డి మాన్యం తండా అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన సారా తయారీదారులు స్థావరాలు వదిలి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నాటుసారా తయారీ కోసం సిద్ధం చేసిన 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే ముడి సరకులు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి: