ETV Bharat / state

Police manhandling on youngster: ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. చితకబాదారు..!

Police manhandling on youngster: ద్విచక్ర వాహనం పోయిందంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువకుడిని.. ఓ ఎస్సై చితకబాదాడు. తనకు న్యాయం న్యాయం జరుగుతుందని ఊహించిన బాధితుడికి అనుకోని సంఘటన ఎదురవడంతో ఆ స్టేషన్​ సీఐకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగింది.

author img

By

Published : Mar 8, 2022, 10:49 AM IST

Police manhandling on youngster at chandragiri in chittor
పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వస్తే.. చితకబాదారు

Police manhandling on youngster: పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువకుడిని.. ఓ ఎస్సై చితకబాదిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగింది. సోమవారం రాత్రి 10గంటల సమయంలో.. తన ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైందని ఫిర్యాదు చేసేందుకు.. కొటాలకు చెందిన రుషేంద్ర అనే యువకుడు పోలీస్ స్టేషన్​కు వచ్చాడు. చంద్రగిరి పోలీస్ స్టేషన్​లో పని చేస్తున్న హోంగార్డు వంశీకృష్ణది తనది ఒకే గ్రామమని తెలిపాడు. కాగా సంక్రాంతి పండుగ రోజు.. తనకు, వంశీకృష్ణకు గొడవ జరిగినట్లు వివరించాడు.

పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వస్తే కొట్టినట్లు తెలిపిన బాధితుడు

తన ద్విచక్ర వాహనం పోయిందని స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే..అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై విజయ్​ కుమార్​తో.. వంశీకృష్ణ అకారణంగా కొట్టించాడని వాపోయాడు. ఎస్ఐ, హోంగార్డుపై తగిన చర్యలు తీసుకోవాలని.. బాధితుడు రుషీంద్ర.. సీఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి:

'రాత్రంతా ఎక్కడికెళ్లావంటే.. వైఎస్‌ వివేకా ఇంటికెళ్లానన్నాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.