ETV Bharat / state

చలో తంబళ్లపల్లె.. తెదేపా నేతల గృహ నిర్బంధం - chalo thamballapalli latest news

చిత్తూరు జిల్లా అంగళ్లులో తెలుగుదేశం నేతలపై జరిగిన దాడికి నిరసనగా.. పార్టీ ఇవాళ చలో తంబళ్లపల్లె నిర్వహిస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు మోహరించారు. తంబళ్లపల్లెకు వెళ్తున్న తెదేపా నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు.

police house arrest at chittor district due to chalo thamballapali
తెదేపా నేతలు గృహనిర్బంధం
author img

By

Published : Dec 12, 2020, 3:53 PM IST

తెదేపా నేతలు తలపెట్టిన చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని.. తంబళ్లపల్లె పరిధిలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మదనపల్లెలో శంకర్ యాదవ్, చిత్తూరులో దొరబాబు, నానిని గృహ నిర్బంధం చేశారు.

police house arrest at chittor district due to chalo thamballapali
తెదేపా నేతలు గృహనిర్బంధం

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అమర్​నాథ్​ రెడ్డి అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.