ETV Bharat / state

తరుణ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Dec 19, 2020, 10:27 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన తరుణ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.

Police chased Tarun murder case in Srikalahasti chitthore district
శ్రీకాళహస్తిలో జరిగిన తరుణ్ హత్యకేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈనెల 10న జరిగిన తరుణ్ కుమార్ హత్య కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన తరుణ్ కుమార్, రైల్వే కొండాపురం మండలం లావనూరుకు చెందిన రామాంజనేయులు రెడ్డి ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. రామాంజనేయులు రెడ్డి భార్య గురించి తరుణ్ కుమార్ అసభ్యంగా మాట్లాడటంతోనే రామాంజనేయలు రెడ్డి హత్య చేసి, బంగారు నగలను అపహరించి పరారైనట్లు పట్టణ సీఐ శివరాముడు తెలిపారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించినట్లు సీఐ వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

ఇదీచదవండి.

డ్యాన్సర్​ ఆత్మహత్య కేసు: ఆ ముగ్గురి మధ్య ఏం జరిగింది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.