చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం కొత్తగొల్లపల్లి గ్రామంలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. గొల్లపల్లికి చెందిన మంగమ్మ.. ఆవుల షెడ్డులో నిద్రిస్తుండగా ఈ నెల 4 వ తేదిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేసి అత్యాచారం చేసినట్లు చెప్పారు.
దర్యాప్తులో భాగంగా కొత్త గొల్లపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌ను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వృద్ధురాలిని సుధాకర్ హత్య చేసినట్లు అంగీకరించాడని...ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: