చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం విజయపురం మండలం మహారాజ పురం గ్రామం వద్ద ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద.. నగిరి పోలీసులు తనిఖీలు చేశారు. బెంగుళూరు వెళ్తున్న కారులో నాలుగు కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న నలుగురిలో ఓ వ్యక్తి పరారవగా.. మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, నగిరి రూరల్ సీఐ... సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి: