చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం రొంపిచర్ల, భాకరాపేట సమీప ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వాహనాలు పరిశీలించగా మామిడి పండ్ల మాటున ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారీ కాగా వాహనం వెనుక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారిపై పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ, రొంపిచర్ల ఎస్ఐ హరి ప్రసాద్, యర్రావారిపాల్యం ఎస్ఐ సోమశేఖర్ ప్రత్యేక బృందాలుగా విడిపోయి అనుమానిత వాహనాలు తనిఖీలు చేపట్టారు.
ఇవీ చూడండి...: సాఫ్ట్వేర్ కుర్రోళ్లు... పేమెంట్ యాప్లతో మోసాలు