ETV Bharat / state

తెదేపా నేతలు అమర్‌నాథ్‌ రెడ్డి, పులివర్తి నాని అరెస్టు - tdp leaders amarnath reddy arrest in kuppam

తెదేపా నేతలు అమర్‌నాథ్‌ రెడ్డి, పులివర్తి నాని అరెస్టు

author img

By

Published : Nov 9, 2021, 11:43 PM IST

Updated : Nov 10, 2021, 8:02 AM IST

23:41 November 09

arrest

తెదేపా నేతలు అమర్‌నాథ్‌ రెడ్డి, పులివర్తి నాని అరెస్టు

మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగిందంటే..

ఎన్నికల్లో కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌ చిట్టిబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 14వ వార్డును ఏకగ్రీవం చేశారంటూ తెదేపా శ్రేణులు సోమవారం చేపట్టిన నిరసన అర్ధరాత్రి వరకూ కొనసాగింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును బయటకు లాగే సమయంలో కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లారు. కిందపడేస్తూ బయటకు తోశారు. పలువురు కార్యకర్తలు గాయాలతో బయటకు వచ్చారు. మరోపక్క, కార్యాలయంలో నిరసనకు దిగి తనతో పాటు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని, అద్దాల పగులకొట్టారని కమిషనర్‌ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై తెదేపా నాయకులు, కార్యకర్తలపై అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 మందిపై ఐపీసీ 143, 147, 353, 427 రెడ్‌ విత్‌ 149తోపాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కుప్పంలోని బీసీఎన్‌ హోటల్‌లో ఉన్న అమరనాథరెడ్డి, పులివర్తి నానిని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖండించిన చంద్రబాబు

కుప్పంలో అర్థరాత్రివేళ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు పులివర్తి నాని లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీనేతలను అరెస్ట్ చేయడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడు లేనివిధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కుప్పం నుంచి బలవంతంగా పంపించి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి కుట్ర అని ఆక్షేపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటలు సాగబోవని స్పష్టం చేశారు. అప్రజాస్వామికoగా అరెస్టు చేసిన అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను వెంటనే విడుదల చేసి, ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం

Last Updated : Nov 10, 2021, 8:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.