శనివారం కావటంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి కాలినడక మార్గం భక్తులతో కిటకిటలాడింది. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత దశల వారీగా టోకెన్లను పెంచుతూ వస్తున్న తితిదే... ప్రస్తుతం పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లను అందిస్తోంది.
ఉదయం 6 నుంచి 2 గంటలకు అలిపిరికి, ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకునేందుకు తితిదే అనుమతిస్తుండటంతో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చూడండి. తిరుమల శ్రీవారికి.. తితిదే పాలక మండలి సభ్యుడు భారీ విరాళం