gravel mafia: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో గ్రావెల్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో గ్రావెల్ వాహనాలు తిరుగుతుండడంతో విసిగిపోయిన నెన్నూరు సమీపంలోని చెంచు లక్ష్మి కాలనీ వాసులు..టిప్పర్లను నిలిపివేసి టైర్లలో గాలి తీశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా గ్రావెల్ తరలింపు వాహనాలు తిరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
gravel mafia: ఒక టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కాలనీకి కరెంటు పూర్తిగా నిలిచిపోయింది. ఆగ్రహించిన కాలనీ వాసులు.. టిప్పర్లను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. అయితే టిప్పర్లను అడ్డుకుంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారని వారు కాలనీవాసులు వాపోయారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
vani vishwanath: వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం తథ్యం- సినీ నటి వాణీవిశ్వనాథ్