పరిషత్ ఎన్నికలు నిర్వహించవచ్చునని.. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన మేరకు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పోలింగ్ సామగ్రి తరలించటంపై ఆయా అధికారులకు.. ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. పరిషత్ ఎన్నికల్లో.. చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పరిషత్ ఎన్నికల సందర్భంగా.. ఏప్రిల్ 8న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో 39 ప్రాంతాల్లో 62 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు.. ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
ఇదీ చదవండి: