కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2020 అవార్డులలో చిత్తూరు జిల్లా రెండు అవార్డులను సాధించగా... అందులో పలమనేరు మున్సిపాలిటీ ఒకటి. సౌత్ జోన్లో మొదటి ర్యాంకు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో 26 వ ర్యాంకు సాధించింది. బెస్ట్ క్లీన్ సిటీ అవార్డు పలమనేరు మున్సిపాలిటీకి లభించింది.
పలమనేరు మున్సిపాలిటీకి అవార్డు రావటం సంతోషంగా ఉందని మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి అన్నారు. పురపాలక సంఘంలో ఉన్నఅధికారులు, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, క్షేత్ర స్థాయి సిబ్బంది పనితీరు... పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ఈ అవార్డు సాధించినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'