చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుంది. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా కరోనా విభాగానికి కేటాయించింది కేవలం 50 పడకలు మాత్రమే. అందులోనూ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నది కేవలం 10 బెడ్ లకు మాత్రమే. శ్రీకాళహస్తితోపాటు తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీ పురం, వరదయ్యపాలెంతోపాటు నెల్లూరు జిల్లా పరిధిలోని పెళ్లకూరు, సూళ్లూరుపేట నుంచి అధిక సంఖ్యలో రోగులు ఇక్కడకు వస్తుంటారు. వసతులు అందుబాటులో లేక అత్యవసర పరిస్థితుల్లో బయట ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
ఆక్సిజన్ సిలిండర్లు మొత్తం 35 అందుబాటులో ఉన్నాయి. అయితే ఉన్నవి అరకొరగా ఉండడంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి