ETV Bharat / state

తలను గోడకు బాదుకుంది... టీచరే కొట్టిందని చెప్పింది..! - తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

కుటుంబ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఎప్పుడూ ఏడ్చేది. ఏంటని ఉపాధ్యాయురాలు అడిగితే గోడకు తలబాదుకుంది. ఇంటికెళ్లి టీచరే కొట్టిందని చెప్పి తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చిందో విద్యార్థిని.

one-student-complaint-their-parent-to-beated-the-teacher
తల బాదుకుని టీచరే కొట్టిందని చెప్పిన విద్యార్థిని
author img

By

Published : Dec 3, 2019, 6:07 PM IST

తలను గోడకు బాదుకుంది... టీచరే కొట్టిందని చెప్పింది..!

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని... కస్తూర్బాగాంధీ పాఠశాలలో బండారు కావేరి ఆరో తరగతి చదువుతోంది. కుటుంబ అర్థిక పరిస్థితులు బాగాలేక తల్లిదండ్రులపై బెంగతో వసతి గృహంలో ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఉండేది. విసిగిపోయిన ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థినిని మందలించి... ఇంటికి పంపించింది. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టిందని తలకు గాయాన్ని చూపించింది. కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు బంధువులుతో సహా పాఠశాలకు వచ్చి ధర్నా చేశారు.

పాపే తలను గోడకు బాదుకుంది...
స్పందించిన పాఠశాల అధికారి అశోక్​రావు... ఇంటిపై బెంగ, తల్లిదండ్రుల ఆర్థిక, అనారోగ్య పరిస్థితులను తలచుకుంటూ కావేరి ప్రతిరోజు ఏడుస్తుందని కుటుంబసభ్యులకు తెలిపారు. నిన్న కూడా తల్లికి ఫిట్స్ ఉందంటూ తరగతి గదిలోనే చాలా సేపు ఏడ్చిందని... ఇతర పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధ్యాయురాలు మందలించిందని తెలిపారు. కోపంతో కావేరి తలను గోడకు గుద్దుకోవడం వల్ల స్వల్ప గాయమైందని... పాప ఇంటికి వెళ్తానని చెప్పగానే పంపించినట్లు తెలిపారు. గతంలోనూ కావేరి ఇలాగే చేసిందని తెలిపారు.

ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...

Intro:TG_KRN_61_03_SRCL_TEACHER MANDHALIMPU_AVB_G1_TS10040

( ) కుటుంబ అర్థిక పరిస్థితులు సరిగా లేక తల్లిదండ్రుల పై బెంగ తో ఓ విధ్యార్థిని హాస్టల్ లో ప్రతి రోజు ఏడ్చుకుంటూ ఉండడంతో విసిగిపోయిన ఆ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థినిని మందలించి ఇంటికి పంపించింది. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్తిని ఉపాధ్యాయురాలు కొట్టిందని తలకు గాయాన్ని చూపెట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో లో బండారు కావేరి ఆరో తరగతి చదువుతుంది. మేడం నన్ను రూంలో వేసి తాళం వేసి కొట్టడంతో తలకు గాయమైందని ఇంటికి వెళ్లి తల్లితో చెప్పుకుంది. దీంతో ఆగ్రహించిన తల్లి, బంధువులు కస్తూర్బా పాఠశాలకు పోలీసులను తీసుకువచ్చి నిలదీశారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో
సేక్టోరియల్ ఆధికారి అశొక్ రావు అప్పటికే విచారణ చేసి వివరిస్తూ.... ఇంటి పై బెంగ, తల్లిదండ్రుల ఆర్థిక , అనారోగ్య పరిస్థితులను తలచుకుంటూ కావేరి ప్రతిరోజు ఏడుస్తుందని తోటి పిల్లలు చెప్పారని, నిన్న కూడా తల్లికి ఫిట్స్ ఉండడంతో గుర్తుకు తెచ్చుకుని తరగతి గదిలో ఏడ్వడంతో ఇతర పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు... ప్రతి రోజూ ఇదేంటని ఉపాద్యాయురాలు మందలించింది అని తెలిపారు, దీంతో విద్యార్థిని తనే తలను గోడకు గుద్దుకోవడంతో స్వల్పగాయమైందని, కావేరి ఇంటికి వెళ్తానంటే పంపిస్తామని, ఉంటామన్న ఉండి చదువుకోవచ్చని, ఇదివరకు కూడా ఆ అమ్మాయి ఇలాగే చేసిందని వివరించారు.

బైట్: ఆశోక్ రావు, కస్తూర్బా పిక్టోరియల్ అధికారిBody:SrclConclusion:ఓ విద్యార్థిని ఏడుస్తుంది అని ఉపాధ్యాయురాలు మందలించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.