చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం దిగువ ముద్ది కుప్పం ఎస్టీ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న పాత కక్షలు భగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలను విడిచాడు.
గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, అదే కాలనీకి చెందిన సునీత కుటుంబాలకు మధ్య ఎప్పటినుంచో తగాదాలు నడుస్తున్నాయి. సోమవారం వీరి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదంతో.. సునీత భర్త తన అత్తగారింటి కుటుంబ సభ్యులతో కలిసి సుబ్రహ్మణ్యంపై మూకుమ్మడి దాడికి దిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న శ్రీరంగరాజపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: