![ntr trust helps to chittor district farmer nageshwar rao family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8216338_316_8216338_1596012740271.png)
చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్‌రాజ్‌పల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు.. మదనపల్లెలో ఓ టీ దుకాణం నడుపుతుండేవాడు. లాక్‌డౌన్ కారణంగా సొంతూరికి వచ్చి వేరుశెనగ పంట వేయాలనుకున్నాడు. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవటంతో... తండ్రి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు కుమార్తెలు వెన్నెల, చందన.. కాడెద్దులుగా మారారు.
ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారి చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ గండిపేట మహిళ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిషన్ ఇవ్వటంతో పాటు... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. సొంత ఊర్లో చదవాలనుకుంటే అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది.
ఇదీ చదవండి: